లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ తెలుగు ఉగాది వేడుకలు
లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. టొర్రన్స్‌లోని శ్రీ పంచముఖ హనుమాన్ టెంపుల్‌లో ఈ ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీమతి కల్పన తిరుమలై విద్యార్థులు భరతనాట్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. తరువాత హారతి, మహా ప్రసాద వితరణ జరిగింది. ఈ వేడుకలకు తెలుగువారు కుటుంబంతో సహా హాజరయ్యారు. లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు సూర్య దామోదర, వైస్ ప్రెసిడెంట్ హిమజ పొన్నగంటి, సెక్రటరీ మహేష్ చింబిలి, జాయింట్ సెక్రటరీ రమ చాపరాల, ట్రెజరర్ వరప్రసాద్ శ్రీరాంభట్ల, జాయింట్ ట్రెజరర్ సునీత నెక్కంటి, ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ అఫైర్స్ రమాదేవి కాకర్లతోపాటు బోర్డ్ చైర్ పర్సన్ విజయభాస్కర్ నెక్కంటి ఇతర బోర్డ్ డైరెక్టర్‌లుగా ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు.