నాటా సభలకు అతిథిగా మాడిశెట్టి గోపాల్
అమెరికాలో జులై 1, 2 తేదీల్లో జరగబోయే నాటా (ఉత్తర అమెరికా తెలుగు సమితి) మహాసభల్లో కరీంనగర్ సమైక్య సాహితి అధ్యక్షుడు, కవి, రచయిత, వ్యాఖ్యాత మాడిశెట్టి గోపాల్ అతిథిగా పాల్గొననున్నారు. ఈ మేరకు నాటా భాషా సాహిత్య విభాగం సమన్వయకర్త డాక్టర్ ఊరిమిండి నరసింహారెడ్డి మాడిశెట్టికి ఆహ్వాన పత్రం పంపించారు. డాలస్ మహా నగరంలోని డాలస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగబోయే ఈ నాటా మహాసభల్లో ఐదు విశిష్ట సాహితీ ప్రక్రియలు నాటకం పద్యం, అవధానం, జానపదం, సినిమా, ప్రక్రియాల్లో కార్యక్రమాలు జరుగనుండగా మడిశెట్టి గోపాల్ జానపద సాహిత్యం పై ప్రసంగించనున్నారు. మాడిశెట్టి గతంలో సింగపూర్, మలేషియా తెలుగు ఉత్సవాల్లో పాల్గొనగా విదేశాల్లో జరిగే సాహిత్య సభల్లో పాల్గొనడం ఇది రెండోసారి. అమెరికాలో పాటు వివిధ దేశాల నుంచి దాదాపు 1,500 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.