ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం : మహేశ్ బిగాల
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. నిజామాబాద్‌లో ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అందిస్తున్న పథకాలతో స్ఫూర్తి పొంది ఇతర రాష్ట్రాల వారు ఇప్పుడిప్పుడే అక్కడ కూడా అమలు చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 ఎంపీ సీట్లను గెలిచి ఢీల్లీలో కీలక పాత్ర పోషించనున్నదన్నారు. ఎన్నారై ప్రతినిధులు సైతం టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారని, క్షేత్రస్థాయిలోనూ వారు పార్టీ విజయానికి కృషి చేస్తున్నారని తెలిపారు. నలభై దేశాల నుంచి వచ్చిన ఎన్నారై ప్రతినిధులు పక్షం రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని చెప్పారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ ఎన్నారై బృందం సభ్యులు సృజన్‌రెడ్డి, రమేశ్, సుమన్ పాల్గొన్నారు.
Tags :