ఆయన మళ్లీ వస్తేనే ఏపీ అభివృద్ధి : మమత
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని సాగనంపితేనే దేశానికి భద్రత అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన టీడీపీ బహిరంగ సభల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ సీఎం చంబ్రాబుతోనే ఏపీ అభివృద్ధి ముడిపడి ఉందని, ఆయన మళ్ళీ వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందని, ప్రజలు ఆలోచించి ఓటేయాలని అన్నారు. ఏపీకి, తెలంగాణకు మధ్య చాలా వ్యత్యాస ముందని, దీంతో పాటు రాజకీయ పరంగా చాలా బేధాలు వున్నాయన్నారు. ముందుగా అమె తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టి అతి సుందరమైన విశాఖ తనకెంతో నచ్చిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏపీకే కాదు, ఢిల్లీకి వచ్చే రోజు అతిదగ్గరో ఉన్నాయని ఆమె సృష్టం చేశారు. దేశంలో మోడీ చేస్తున్న అరాచకాలపై పోరాటం చేస్తున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారని వారిలో చంద్రబాబు ఒకరన్నారు. మోదీ తాను చౌకీ దార్ అంటున్నారని, ఎవరికీ ఆయన చౌకీదార్? ప్రజలకు మాత్రం కాదని పెట్టుబడీదారీ వ్యవస్థకు, దోపిడీ వ్యవస్థకు మోడీ చౌదీ దార్ అని ఆమె ఆరోపించారు. తమకు అవకాశం ఇవ్వమని 365 రోజులు ప్రజలు సేవలో ఉంటామని ఆమె పిలుపునిచ్చారు.