ASBL Koncept Ambience

మాట బతుకమ్మ వేడుకలు విజయవంతం

మాట బతుకమ్మ వేడుకలు విజయవంతం

మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (మాట) ఆధ్వర్యంలో న్యూ జెర్సిలోని రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌లో అక్టోబర్‌ 15వ తేదీన నిర్వహించిన అతిపెద్ద బతుకమ్మ, దసరా వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు2000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా మాటా బృందం 21 అడుగుల బతుకమ్మను అంగరంగ వైభవంగా తయారు చేసి ప్రదర్శించడం హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాట స్టాండిరగ్‌ కమిటీ సభ్యుడు శేషగిరి రావు రచించిన మరియు స్వరపరిచిన కొత్త బతుకమ్మ పాటను ఈ వేడుకల్లో ఆవిష్కరించారు. అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు శ్రీనివాస్‌ గనగోని, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, కిరణ్‌ దుద్దగి డా. లింగ శ్రీనివాస్‌ రావు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేసారు. 

ఈ సందర్భంగా  శ్రీనివాస్‌ గనగోని మాట్లాడుతూ, మాటా నిర్వహించే కార్యక్రమాలు, బతుకమ్మ వేడుకల విశిష్టతను తెలియజేశారు. గాయని సాయి వేద వాగ్దేవి బతుకమ్మ పాటలతో అలరించింది. ఆమె పాటలను పాడుతుంటే మరోవైపు మహిళలు బతుకమ్మ ఆట ఆడటం కనువిందుచేసింది. శ్రీనివాస్‌ గనగోని, కిరణ్‌ దుద్దగి, స్వాతి అట్లూరి, విజయ్‌ భాస్కర్‌ కలాల్‌, ప్రవీణ్‌ గూడూరు, మహేందర్‌ నరాల, వేణు గోపాల్‌ గిరి, రంగారావు, శిరీష గుండపనేని, వెంకీ ముస్తీ, మల్లిక్‌ రెడ్డి, కృష్ణ సిద్ధాడ, గోపి వుట్కూరి, రఘు మోడుపోజు, రఘురాం రెండుచింతల, గిరిజా మాదాసి, దీపక్‌ కట్ట, రాకేష్‌ కస్తూరి, నరేందర్‌ రెడ్డి, మహేష్‌ చల్లూరి, చైతు మద్దూరి ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను చేశారు. మంజుల గనగోని, శిరీష, అరుంధతి షకేలి, జ్యోతి కృష్ణ, రాధిక మడుపోజు, పద్మిని దుద్దగి, లలిత మాడిశెట్టి, నీలిమ వారణాసి బతుకమ్మలను తయారు చేయడంలో సహకరించారు. మాట ఫిలడెల్పియా టీమ్‌ ఐవిపి శ్రీధర్‌ గూడాల, బిఓడి మల్లిక్‌ రావు బొల్లా ఈ సందర్భంగా వేడుకలను విజయవంతం చేయడంలో భాగస్వాములైన  గౌరవ సలహాదారులు వెంకటేష్‌ ముత్యాల, దాము గేదెలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ వేడుకలను విజయవంతం చేసినవారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు చెప్పారు. 

 

Click here for Event Gallery

 

 

Tags :