ASBL Koncept Ambience

"ఆటా"లో మణిశర్మ సంగీత విభావరి

"ఆటా"లో మణిశర్మ సంగీత విభావరి

చికాగోలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ఆటా మహాసభల్లో  ప్రేక్షకులను హుషారెత్తించటానికి సినిమా గాయనీ గాయకులతో సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో ఈ విభావరి జరగనున్నది. గాయకుడు మనో, గాయని కల్పన పాటలను పాడనున్నారు. వీరితోపాటు శ్రీకృష్ణ, అంజనా సౌమ్య, రాహుల్‌ సిపిల్‌గంజ్‌, నూతకి, శ్రీనిధి, సాహితీ, ఉమ మోహన్‌, చంద్ర తేజ తదితరులు తమ పాటలతో వీనుల విందు చేయనున్నారు. మణిశర్మ  సంగీత దర్శకత్వంలో వచ్చిన ఎన్నో పాటలు సూపర్‌ హిట్టయిన సంగతి తెలిసిందే. హుషారైన పాటలతో, ఉత్సాహపరిచే గాయకులతో ఏర్పాటు చేసిన ఈ విభావరి ఆటా మహాసభలకు మరో ఆకర్షణగా నిలువనున్నది.

 

Tags :