నాట్స్ మహాసభల్లో నృత్యార్పణ
న్యూజెర్సిలో నాట్స్ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పొజిషన్ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి మంజుభార్గవి (శంకరాభరణం ఫేమ్) సమర్పించు నృత్యార్పణ కార్యక్రమం మరో ఆకర్షణగా నిలవనున్నది. న్యూ జెర్సిలోని కూచిపూడి నృత్యగురువులతో కలిసి ఈ నృత్య ప్రదర్శనను మంజు భార్గవి చేయనున్నారు. ఇందులో కవితా చౌదరి తోటకూర, రేణు నూకల, శ్రీదేవి ముంగర, ఇందిర శ్రీరామ్, అపర్ణ నాదెళ్ళ, దివ్య ఏలూరి నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
Tags :