నాటా మేట్రిమోనీ
డల్లాస్లో జూన్ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే నాటా మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు సాహిత్య కార్యక్రమాలకు కూడా పెద్ద పీట వేశారు. అమెరికాలోని తెలుగు వాళ్ళ పేరెంట్స్కోసం ప్రత్యేకంగా నాటా మేట్రిమోని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పెళ్ళికాని యువతీ యువకులు, వారి తల్లితండ్రులు ఒకరినొకరు కలుసుకుని ఒకరికి ఒకరు తెలుసుకుని తమ ఇష్టాలకు అనుగుణంగా ఉన్న వివాహ బంధాలను ఏర్పాటు చేసుకునేందుకు వేదికగా నాటా మేట్రిమోనియల్ వేదిక నిలవనున్నది. సింగిల్స్ మీట్ అండ్ గ్రీట్, భలే జోడీ గేమ్ షో, మేట్రిమోని యల్ సర్వీస్పై ఓ సెమినార్ను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. భారతీయుల వివాహ వేడుకలపై కూడా ఓ సెమినార్ జరగనున్నది. వివాహ వేడుకల ఖర్చుపై ఓ ప్రణాళికను ఎలా చేయాలన్న దానిపై కూడా ఈ కార్యక్రమంలో తెలియజేయనున్నారు. ఇతర వివరాల కోసం చూడండి.