మాయావతి సంచలన నిర్ణయం
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సంచలన ప్రకటన చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి విజయమే తనకు ముఖ్యమని మాయావతి పేర్కొన్నారు. మాయావతి ఎన్నికల్లో పోటీ చేయరంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. రానున్న రోజుల్లో కేంద్రంలో కీలక పాత్ర పోషించేందుకు పావులు కదుపుతున్నారు. కలిసివస్తే మాయావతి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదని ఇప్పటికే పలువురు రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్పారు. అయితే ఇలాంటి సందర్భంలో లోక్‌సభ ఎన్నికల బరిలో నుంచి మాయావతి తప్పుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Tags :