ASBL Koncept Ambience

డొనాల్డ్ ట్రంప్‍కు సిల్వర్‍ కీ ఇవ్వలేకపోయాం

డొనాల్డ్ ట్రంప్‍కు సిల్వర్‍ కీ ఇవ్వలేకపోయాం

తాజ్‍మహల్‍ను సందర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍కు సిల్వర్‍ కీ ఇవ్వలేకపోయినందుకు బాధగా ఉందని ఆగ్రా మేయర్‍ నవీన్‍ జైన్‍ అన్నారు. భద్రతా కారణల వల్ల ఎయిర్‍ బేస్‍ వద్ద ట్రంప్‍కు స్వాగతం పలికే అవకాశం తనకు రాలేదని తెలిపారు. ట్రంప్‍కు కానుకగా ఇవ్వాలని 12 అంగుళాల పొడవు, 600 గ్రాముల బరువుతో వెండి తాళంచెవిని తయారు చేయించినట్లు, దానిపై తాజ్‍మహల్‍ చిత్రంతోపాటు, నగరం పేరును చెక్కించినట్లు పేర్కొన్నారు.

 

Tags :