ఫిలడెల్ఫియాలో అలరించిన మేడసాని మోహన్ ప్రవచనం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో పెన్సిల్వేనియాలోని చెస్టర్ స్ప్రింగ్స్, బయర్స్ స్టేషన్‌క్లబ్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన ''సంస్కతాంధ్ర సాహిత్యంలో హాస్యం-చమత్కారం'' కార్యక్రమం ఆకట్టుకుంది. అవధాన ప్రక్రియలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహా మేధావి, ధారణ బ్రహ్మ, సరస్వతీ పుత్రులైన మేడసాని మోహన్ ఈ అంశంపై చేసిన ప్రవచనం వచ్చినవారిని ఎంతగానో అలరించింది. ఈ సందర్భంగా మేడసాని మోహన్‌ను తానా నాయకులు ఘనంగా సత్కరించారు.
తానా కార్యదర్శి రవి పొట్లూరి, బోర్డు చైర్మన్ హరీష్ కోయ, ఫౌండేషన్ సెక్రటరి రవి మందలపు, నాగరాజు నలజుల, సతీష్ చుండ్రు, సతీష్ తుమ్మల, వేణు సంగాని, సాయి జరుగులతోపాటు దాదాపు రెండువందలమందికిపైగా తెలుగు భాషాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags :