న్యూజెర్సిలో మేడసాని మోహన్ ప్రవచన కార్యక్రమం సక్సెస్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సి టీమ్, న్యూజెర్సి తెలుగు కళాసమితి (టిఫాస్),సాయిదత్తపీఠంతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ప్రముఖ సహస్ర అవధాని,సరస్వతీ పుత్రులు, మహా పండితులు డా. మేడసాని మోహన్ ప్రవచన కార్యక్రమం విజయవంతమైంది. న్యూజెర్సిలోని ఎడిసన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు, భాషాభిమానులు హాజరయ్యారు. మహాభారతంలోని సభాపర్వం అంశాన్ని తీసుకుని కర్త, కర్మ, క్రియ అంశాలపై ప్రవచనం చేశారు. ప్రతి మనిషి జీవితంలోనూ ఇవి ముడిపడి ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా పురాణాలపై పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ లక్ష్మీదేవినేని, న్యూజెర్సి రీజినల్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి, రత్న ముల్పూరి, వంశీ వాసిరెడ్డి, శివాని, శ్రీనివాస్ ఓరుగంటి ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. తానా కార్యదర్శి రవి పొట్లూరి, సాయిదత్త పీఠం నుంచి రఘు శంకరమంచి, టిఫాస్ ప్రెసిడెంట్ సుధాకర్ ఉప్పల, సెక్రటరీ మధు తదితరులు కూడా ఈ కార్యక్రమం విజయవంతానికి తోడ్పడ్డారు. స్థానిక ప్రముఖులు దాము గెదెల, మధుతోపాటు నాగరాజు నలజుల, సాయి దత్తపీఠం వలంటీర్లు ఈ కార్యక్రమం చక్కగా జరగడానికి కృషి చేశారు.