ASBL Koncept Ambience

కరోనా ఫై శ్రీవారిని వేడుకుంటూ ఆలపించిన సునీత విజయ్ కోస్న పాట

కరోనా ఫై శ్రీవారిని వేడుకుంటూ ఆలపించిన సునీత విజయ్ కోస్న పాట

ప్రపంచ జన జీవన వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న కరోన వైరస్ గురించి అనేకమంది కళాకారులు తమ‌ ఆట పాటల ద్వారా అవహాగాన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో కొంచేం వినూత్నంగా ఆలోచించి భక్తి పారవశ్యంతో కూడిన సందేశాత్మక గీతాన్ని రూపొందించారు. ఈ మహమ్మారి కరోనాను అంతం చెయ్యాలని  దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ అక్లాండ్ కు చెందిన సునీత విజయ్ కోస్న ఈ గీతాన్ని రచించగా ఆష్జ గంగాధర్ స్వరకల్పన చేసారు. సౌజన్య ఆలపించగా విల్సన్ సంగీతం అందించారు. ఏడుకొండల వెంకన్న మహిమతో‌ ఈ మహమ్మారికి త్వరగా వ్యాక్సిన్ తయారై భక్తులు కొండకు యదావిధిగా వచ్చేలా చూడాలని ఈ పాటలో వేడుకోవడం జరిగింది. కరోనా వ్యాప్తి, తీస్కోవల్సిన జాగ్రత్తలు లాక్‍ డౌన్‍ యొక్క తీవ్రతను ఈ పాటలో సవివరంగా తెలియజేసారు.

Tags :