ASBL Koncept Ambience

సరదాగా ఈ సాయంత్రం!

సరదాగా ఈ సాయంత్రం!

సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం రండి అంటున్నారు మెంఫిస్ తెలుగు సమితి అధ్యక్షులు వాన రత్నాకర్.శనివారం సాయంత్రం 4 నుండి 7 వరకు కాలేర్విల్లె హై స్కూల్లో అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు జరిగినట్లు రత్నాకర్ చెప్పారు. పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా అందరికి సుపరిచితురాలైన అఖిల మామండూరు సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణ. మెంఫిస్ తెలుగు సమితిగత రెండువారాలుగా సాహిత్య, సంగీత, నృత్య, అలంకరణ, ముగ్గులు, అల్లికలు, కేశాలంకరణ మరెన్నో విభాగాల్లో పోటీలు నిర్వహించింది. ఈసాయంత్రం సంక్రాంతి సంబరాల్లో విజేతలకు సర్టిఫికేట్లు, బహుమానాలు ప్రధానం చేస్తారు. దాదాపు మూడు గంటలపాటు జరిగే ఈ సంబరాల్లో స్థానికతెలుగు కుటుంబాలు వైవిధ్యంతో కూడుకొన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. ఆంధ్రుల ఆవకాయ, ఆరిసాలు, guttivankaya కూర, గోంగూర పచ్చడి, గుమ్మడికాయ పులుసు ఇలా మరెన్నో వంటకాల విందుభోజనం, ఆంద్ర కిల్లి ఆరగింపుతో కార్యక్రమం పసందుగా ముగుస్తుంది.

 

Tags :