ASBL Koncept Ambience

విశాఖలో ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్

విశాఖలో ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్

విశాఖ వేదిక వచ్చే నెల 3, 4 తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, పరిశ్రమ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌, పరిశ్రమల శా డైరెక్టర్‌ సృజన తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్‌ మాట్లాడుతూ ఈ  సదస్సుకు 25 దేశాల నుంచి పారిశ్రామిక  ప్రముఖులు హాజరవుతున్నారని, ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు 7,500 మంది ఇప్పటివరకు రిజిస్టర్‌ చేయించుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని  ఉన్న వనరులు, సరళీకృత ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామికవేత్తలకు వివరించడంతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్టు తెలిపారు. ఈ సమ్మిట్‌ ద్వారా రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రాబట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమ్మిట్‌లో సుమారు 20 దేశాలు ఆంధ్రప్రదేశ్‌తో వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

 

 

Tags :