రాష్ట్రానికి రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు : మంత్రి అమర్‌నాథ్
విశాఖ వేదికగా రెండు రోజులపాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ( గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్)లో 352 ఒప్పందాలు చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. సదస్సు ముగిసిన అనంతరం ఆయన మీడియతో మాట్లాడుతూ రాష్ట్రానికి రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తొలుత రూ. 5 లక్షల కోట్లు వస్తాయని భావిస్తే అంతకుమించి రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పరిశ్రమల వల్ల 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. సదస్సు వల్ల ఏపీ సహజ వనరులు ప్రపంచానికి తెలిశాయి. సదస్సులో వంద దేశాల ప్రతినిధులు, ఏడు దేశాల రాయబారులు పాల్గొన్నారు అని తెలిపారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే పరిశ్రమలను స్థాపిస్తామని అన్నారు.
Tags :