ASBL Koncept Ambience

సహస్రాబ్ది ఉత్సవాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

సహస్రాబ్ది ఉత్సవాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ముచ్చింతల్‌లో కొలువైన సమతామూర్తిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శంషాబాద్‌ సమీపంలోని శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజచార్యుల సమతామూర్తి సహస్రాబ్ధి  ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా చినజీయర్‌ స్వామితో పాటు వేదపండితులు శాస్త్రోకంగా మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పరిసరాల్లోని దేవాలయాలను మంత్రి పరిశీలించారు. సుమారు మూడు గంటల పాటు ఆయన సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు.

 

Tags :