ASBL Koncept Ambience

ఈ నెల 28న యాదాద్రిలో.. మహాకుంభ సంప్రోక్షణ

ఈ నెల 28న యాదాద్రిలో.. మహాకుంభ సంప్రోక్షణ

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి, సీపీ మహేశ్‌ భగవత్‌, కలెక్టర్‌ పమేలా సత్పత్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Tags :