రైట్ కేర్ కి కేటీఆర్ అభినందనలు
గత సంవత్సరం కరోనా కష్ట సమయంలో వచ్చిన ఆలోచనతో మొదటగా విశాఖపట్నం లో ప్రారంభించబడి, ఇప్పుడు హైదరాబాద్ వరకు విస్తరించిన రైట్ కేర్ సంస్థ ని ప్రస్తుతం కాలిఫోర్నియా లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి శ్రీ కేటీఆర్ అభినందించారు.
కాలిఫోర్నియా రాష్ట్రం లో శాన్ హోసే నగరం లో ఉన్న శ్రీ కేటీ రామారావుని, ఐటీ శాఖ కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, ఇఏఎస్ లను రైట్ కేర్ సంస్థ ప్రెసిడెంట్ శ్రీ మనోహర్, డైరెక్టర్ శ్రీ శివ దువ్వూరు కలిసి తెలుగు రాష్టాలలో రైట్ కేర్ ద్వారా ఇంటి వద్దే వైద్యం అందించే సదుపాయాలను (హోమ్ కేర్ సర్వీసెస్) ఏర్పాటు చేసి పని చేస్తున్న సంగతులు, రైట్ కేర్ యాప్ పనితీరు ని వివరించారు.
శ్రీ కేటీఆర్ రైట్ కేర్ సేవలను, శ్రీ మనోహర్ ని ఐటీ ద్వారా వైద్య రంగం లో చేసే సేవలను అభినందించారు. శ్రీ జయేష్ రంజన్ కూడా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, లేదా ఐటీ హబ్ నుంచి ఎలాంటి సహాయం కావాలన్న ఇస్తామని శ్రీ మనోహర్ కి హామీ ఇచ్చారు.