ASBL Koncept Ambience

బ్రిటన్ మినిస్టర్ రనిల్ జయవర్ధనతో మంత్రి కేటీఆర్ భేటీ

బ్రిటన్ మినిస్టర్ రనిల్ జయవర్ధనతో మంత్రి కేటీఆర్ భేటీ

బ్రిటన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ మినిస్టర్‌ రనిల్‌ జయవర్ధనతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. లండన్‌లోని మంత్రి జయవర్ధన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం ప్రాధాన్యతలు, తెలంగాణలో ఉన్న మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలకు సంబంధించిన పలు అంశాలపైన చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బయో ఏషియా సదస్సులో పాల్గొనాల్సిందిగా జయవర్ధనకు మంత్రి కేటీఆర్‌ ఆహ్వానం పలికారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టిఎస్‌ఐపాస్‌ విధానం గురించి తెలుసుకున్న బ్రిటన్‌ మంత్రి, ఈ విధానంపై ప్రశంసలు తెలియజేశారు.

Click here for Photogallery

 

 

Tags :