దావోస్ లో సద్గురు జగ్గీ వాసుదేవ్ తో మంత్రి కేటీఆర్
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా తెలంగాణ పెవిలియన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో మంత్రి కేటీఆర్ సంభాసించారు. ప్రపంచ వ్యాప్తంగా చేపడుతున్న సేవ్ సాయిల్ ఉద్యమంపై ఈ సందర్భంగా సద్గురు మాట్లాడుతూ రెండు మూడు దశాబ్దాదల్లో ప్రపంచంలోని వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించిపోయే ప్రమాదం ఉందని, తద్వారా ఆహార కొరత ఏర్పడే ముప్పు పొంచి ఉందన్నారు. దీనిని నివారించాలంటే భూమిని సారవంతం చేసే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. ఇందు కోసం లండన్ నుంచి కావేరీ వరకు తాను నిర్వహిస్తున్న సేవ్ సాయిల్ ర్యాలీలో భాగంగా పలువురు ప్రభుత్వాధినేతలను, ప్రముఖ కంపెనీలను కలిసి ఈ కార్యక్రమం ప్రాధాన్యాన్ని వివరిన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు పర్యావరణ అనుకూల కార్యక్రమాల గురించి జగ్గీ వాసుదేవ్‌కు తెలిపారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ కార్యక్రమాలను ప్రశంసించిన సద్గురు.. రైతు ఆదాయం పెంపునకు చేపట్టిన కార్యక్రమాల పైన తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నమని తెలిపారు.