మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం
దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావుకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ఆర్థిక నాయకుల భేటీకి ఆయన హాజరయ్యారు. వివిధ దేశాల్లోని ప్రభుత్వాధినేతలు, ప్రధాన మంత్రులు, కేంద్ర ప్రభుత్వ సీనియర్ మంత్రులు ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్రమంత్రి హోదా గల వారు కేటీఆర్ ఒక్కరే. సాంకేతిక ప్రాధాన్యం, పాలన అంశంపై ఈ సమావేశం జరిగింది. సెర్బియా, పోలెండ్, ఈస్టోనియా ప్రధాన మంత్రులు, బ్రెజిల్, సింగపూర్, కొరియా, ఇండోనేసియా, బోట్స్‌వానా, ఒమన్, ఇథియోపియా దేశాలకు చెందిన పలువురు సీనియర్ కేంద్ర మంత్రులతో పాటు కేటీఆర్ ఈ చర్చలో పాలుపంచుకున్నారు.
Tags :