ASBL Koncept Ambience

‘అప్లైడ్ మెటీరియల్స్’ కార్యాలయంలో కేటీఆర్

‘అప్లైడ్ మెటీరియల్స్’ కార్యాలయంలో కేటీఆర్

అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ శాన్‌ హోజేలో సెమీకండక్టర్‌ మరియు సంబంధిత పరికరాల తయారీలో అగ్రశ్రేణి కంపెనీ ‘అప్లైడ్‌ మెటీరియల్స్‌’ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఓం నలమాసుతో  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామిక అనుకూల విధానాలను మంత్రి వివరించారు. ఈ సమావేశంలో అప్లైడ్‌ మెటీరియల్స్‌ ఇండియా ప్రెసిడెంట్‌, ఎండీ, శ్రీనివాస్‌ సత్య, ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఎలక్ట్రానిక్స్‌ డైరెక్టర్‌ సుజయ్‌ కారంపురి, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.

కాన్సల్‌ జనరల్‌ సమావేశంలో...

శాన్‌ ఫ్రాన్సిస్కో కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ నాగేంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్‌ క్లూజివ్‌ ఇన్వెస్టర్స్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి శ్రీ కేటీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కరోనా పాండమిక్‌ ముగిసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుత అవకాశాలకు ఆస్కారం ఏర్పడిరదన్నారు. 2015 లో తెలంగాణ నూతన రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి బే ఏరియాకు వచ్చిన తను, ఇవాళ తెలంగాణ విజయగాథను వివరించడానికి మరోసారి వచ్చానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అనుసరిస్తున్న డెవలప్‌ మెంట్‌ మోడల్‌ ను కేటీఆర్‌ వివరించారు. అన్ని రంగాల్లో సమానమైన వృద్ధిని ఎలా సాధించవచ్చో చూడాలంటే తెలంగాణకు రావాలన్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ తెలంగాణ కూడా ఇవాళ వృద్ధిలో దూసుకుపోతుందన్నారు కేటీఆర్‌. ఇండియాలో విజయవంతమైన రాష్ట్రాల్లో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు.

 

Tags :