పేపాల్ వైస్ ప్రెసిడెంట్ రిచెర్డ్ నాష్‌తో మంత్రి లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి సిద్దంగా వున్నామని పేపాల్ వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌కు సృష్టం చేశారు. దావోస్ పేపాల్ వైన్‌ప్రెసిడెంట్ రిచర్డ్ నాష్‌తో లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత ఎదురైన సమస్యలను అధిగమించేందుకు పెద్ద ఎత్తున టెక్నాలజీ వినియోగిస్తున్నామని మంత్రి వివరించారు. ఒక స్టార్టప్ రాష్ట్రంగా ఆధునాతన టెక్నాలజీ వినియోగంతో కేవలం మూడున్నరేళ్లలో అభివృద్ధి సాధించామన్నారు. ఐటి, ఫింటెక్ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పాలసీలను, రాయితీలను కల్పిస్తున్నట్లు మంత్రి ఆయనకు వివరించారు. పాత టెక్నాలజీలను పక్కనబెట్టి బ్లాక్‌చైన్, ఫింటెక్ లాంటి టెక్నాలజీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. అమరావతి పరిధిలో ల్యాండ్ రికార్డు అన్ని బ్లాక్ చెన్‌టెక్నాలజీ కిందకి తీసుకొస్తున్నామని, దీనివల్ల ల్యాండ్ రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశముండదన్నారు. ల్యాండ్ రికార్డ్‌ను బ్లాక్‌చైన్ ప్లాట్‌ఫారంపైకి తీసుకురావడంతో రుణాలు అతి తక్కువ సమయంలో పొందే అవకాశం వచ్చిందన్నారు.
విశాఖపట్నంలో వీసాతో కలిసి పనిచేస్తున్నామన్నారు. లెన్‌క్యాష్ సిటీగా విశాఖపట్నాన్ని మార్చేందుకు చేపట్టిన కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోందని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలన్నీ లెన్‌క్యాష్ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. ఈ సందర్భంగా రిచర్డ్ నాష్ మాట్లాడుతూ ఏపీ అధునిక సాంకేతికత వినియోగంలో ముందంజలో వుందని ప్రశంసించారు. ఏపీకి పేపాల వాణిజ్య కార్యకలాపాలను పెద్దఎత్తున విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.