ASBL Koncept Ambience

డల్లాస్‌లో జరిగే తెలుగు టైమ్స్‌ బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ 2024 బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌ బాబు

డల్లాస్‌లో జరిగే తెలుగు టైమ్స్‌ బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ 2024 బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌ బాబు

అమెరికాలోని తెలుగువారికి మీడియాపరంగా 2 దశాబ్దాలకుపైగా సేవలందిస్తున్న ‘తెలుగు టైమ్స్‌’ పత్రిక ఎన్నారై తెలుగు బిజినెస్‌ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం చాలా సంతోషదాయకంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. డల్లాస్‌లో ఈ సంవత్సరం తెలుగు టైమ్స్‌ నిర్వహించనున్న బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డు బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆమెరికాలోని ఎన్నారై తెలుగు కమ్యూనిటీకి మీడియాపరంగా సేవలందించడంతోపాటు ఎన్నారై తెలుగు బిజినెస్‌ ప్రముఖులను గుర్తించి బిజినెస్‌ అవార్డులను ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల వారికి మాతృరాష్ట్రాల్లో కూడా తగిన గుర్తింపు, వారి వివిధ రంగాల్లో చేస్తున్న సేవలు తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు.  

తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌, సీఈఓ సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ, ఈ బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డులను గత సంవత్సరం ప్రారంభించామని, గతంలో 10 అవార్డులను ఇచ్చామని, ఈ సంవత్సరం 15 అవార్డులదాకా ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ బిజినెస్‌ అవార్డులకు సంబంధించిన నామినేషన్లను ఏప్రిల్‌ 15 నుంచి మే 31 వరకు స్వీకరిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ప్రత్యేక వెబ్‌ సైట్‌ కూడా గతంలోనే ప్రారంభించామని అందరూ ఈ వెబ్‌ సైట్‌ ద్వారా తమ నామినేషన్లను పంపించాలని ఆయన కోరారు. ఈ పోస్టర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగు టైమ్స్‌ బోర్డ్‌ మెంబర్‌ రామ్‌ సుశాంత్‌, మిత్రులు సుబ్రమణ్యం వెంట్రాప్రగడ కూడా పాల్గొన్నారు. 

ఇతర వివరాలకు https://www.telugutimes.net/businessexcellenceawards/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన కోరారు.   

ఈ అవార్డుల వేడుకకు మీడియా పార్ట్‌నర్‌గా టీవీ 9 వ్యవహరిస్తోందని, అవార్డుల వేడుకకు ఆర్గనైజింగ్‌ పార్టనర్‌గా టాంటెక్స్‌ తెలుగు అసోసియేషన్‌ ఉంది. జాతీయ తెలుగు సంఘాలైన తానా, ఆటా, నాట్స్‌, నాటా, టిటిఎ కమ్యూనిటీ పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నాయి.

 

Click here for Photogallery

 

 

Tags :