ASBL Koncept Ambience

విష్వ‌క్సేనేష్టి యాగంలో ప్రధాని మోదీ

విష్వ‌క్సేనేష్టి యాగంలో ప్రధాని మోదీ

ముచ్చింతల్‌ యాగశాలకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన విష్వక్సేనేష్టి యాగంలో ప్రధాని మోదీ, గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, చిన్నజీయర్‌ స్వామి, జూపల్లి రామేశ్వర్‌ రావు పాల్గొన్నారు. యాగంలో పాల్గొన్న మోదీకి పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా మోదీకి చిన్నజీయర్‌ స్వామి ఓ కంకణాన్ని బహుకరించారు. అనంతరం యాగశాల చుట్టూ మోదీ ప్రదక్షిణలు చేశారు. మోదీ బంగారు వర్ణం దుస్తులు ధరించి యాగానికి హాజరయ్యారు.

 

Tags :