సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ
శంషాబాద్ ముచ్చింతల్‌లోని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌స్వామి ఆశ్రమ ప్రాంగణంలో సమతామూర్తి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 5న హాజరు కానున్నారు. రామానుజుల భారీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 7వ తేదీన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, 8న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్సవ మూర్తిని దర్శించుకోనున్నారు. అలాగే 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల కీలక నేతలు, ఆద్మాత్మిక వేత్తలు, వివిధ పీఠాధిపతులు కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. భక్త జనం కూడా భారీగా తరలివస్తున్నారు.
Tags :