ASBL Koncept Ambience

24న బైడెన్ తో మోదీ భేటీ

24న బైడెన్ తో మోదీ భేటీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సమావేశం కానున్నారు. ఈ నెల 24న జో బైడెన్‌, నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వైట్‌హౌస్‌ ప్రకటించింది. ప్రధాని మోదీ ఈ వారంలో అమెరికా వెళ్లనున్నారు. వీరు గతలో వర్చువల్‌ ద్వారా జరిగిన క్వాడ్‌ సమ్మిట్‌, వాతావరణ మార్పులపై సదస్సు, జీ`7 సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ చివరిసారిగా అమెరికాకు 2019లో వెళ్లారు. హోస్టన్‌లో నిర్వహించిన హౌడీ మోదీ అనే కార్యక్రమంలో అమెరికాకు అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి పాల్గొన్న సంగతి తెలిసింది. జో బైడెన్‌ ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మోదీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి.

 

Tags :