ASBL Koncept Ambience

హైదరాబాద్‌లో మోనార్క్‌ ట్రాక్టర్స్‌ టెస్టింగ్‌ ఫెసిలిటీ

హైదరాబాద్‌లో మోనార్క్‌ ట్రాక్టర్స్‌ టెస్టింగ్‌ ఫెసిలిటీ

హైదరాబాద్‌లో తమ సంస్థ విస్తరణకు మోనార్క్‌ ట్రాక్టర్స్‌ సంస్థ ముందుకు వచ్చింది. నగరంలోని తమ పరిశోధన, అభివృద్ధి సంస్థ (ఆర్‌ అండ్‌  డీ)ను విస్తరించే అంశంపై సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని బృందంతో మోనార్క్‌ ట్రాక్టర్స్‌ సంస్థ ప్రతినిధులు చర్చించారు. అనంతరం హైదరాబాద్‌లో తమ ఆర్‌ అండ్‌ డీ సంస్థకు అనుబంధంగా స్వయం ప్రతిపత్తి ట్రాక్టర్‌ టెస్టింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  హైటెక్‌, పర్యావరణ అనుకూల కంపెనీలను ఆకర్షించడంపై తాము దృష్టిసారించామని, మోనార్క్‌ ట్రాక్టర్స్‌ ను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని సీఎం  రేవంత్‌ రెడ్డి  తెలిపారు. స్వయం ప్రతిపత్తి , ఎలక్ట్రిక్‌ వాహనాల సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపామని, ఆ విజన్‌లో మోనార్క్‌ ట్రాక్టర్స్‌ భాగమై.. రాష్ట్రంలో తమ ఉనికిని విస్తరించుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్రంలో తమ కార్యకలాపాలపై  చర్చించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డిని, ఇతర అధికారులను కలవడం ఎంతో  సంతోషం కలిగించిదని మోనార్క్‌ ట్రాక్టర్స్‌ సీఈవో ప్రవీణ్‌ పెన్మెచ్చ వెల్లడించారు. హైదరాబాద్‌లోని తమ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం అధునాతన డ్రైవర్‌- ఆప్షన్‌ స్మార్ట్‌ ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లను రూపొందించడంలో కీలకపాత్ర పోషించిందని చెప్పారు. తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు తాము చూస్తున్నామని, ఫలితంగా హైదరాబాద్‌ ప్రాంతంలో మరింత ఉత్పత్తి, ఉపాధి  అవకాశాలు వస్తాయని తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి స్వయంప్రతిపత్తి, డ్రైవర్‌, డ్రైవర్‌ లెస్‌ స్మార్ట్‌ ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లతో మోనార్క్‌ ట్రాక్టర్స్‌ సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నది.

 

Click here for Photogallery

 

 

Tags :