బ్లాక్ శారీలో అదరగొడుతున్న మౌనీ రాయ్
బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ మౌనీరాయ్ అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత రెండు మూడు రోజులుగా అమ్మడు తన ఇన్‌స్టాలో కొత్త కొత్త ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. డిజైనర్ దస్తుల్లో తనదైన మార్క్ అందాలను ఎలివేట్ చేస్తూ నెట్టింట హాట్ టాపిక్ గా మారిన మౌనీ రాయ్ తాజాగా బ్లాక్ శారీలో మెరిసింది. చీరను మ్యాచ్ చేస్తూ షోల్డర్ లెస్ బ్లౌజ్ వేసుకుని టాప్ టు బాటమ్ బ్లాక్‌లో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది. నల్లని కొప్పులో తెల్లని గులాబీతో మొత్తంగా బ్లాక్ అండ్ వైట్ కాంబోలో మౌనీ అదరగొట్టింది.
Tags :