ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఏపీ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే అత్యంత వేగంగా 11 శాతం వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతోందని ఎంపీ గల్లా జయదేవ్ సృష్టం చేశారు. అంతర్జాతీయంగా తాజా పరిణామాలు, తెలుగువారిపై ప్రభావం అంశాలపై ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకుంటున్న చర్యల కారణంగా ఇదే వేగం మరో పదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో వృద్ధి 12 శాతానికి మించి జరుగుతుందని తెలిపారు. అమెరికా నుంచి తిరిగి వచ్చే ప్రవాస భారతీయులు సొంతంగా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు స్థాపిస్తే రాష్ట్రం ఆర్థికంగా, మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రవాస భారతీయులకు అండగా ఉంటామని ప్రకటించారు. గల్లా జయదేవ్ అమెరికాలో ఉన్నప్పుడు తన ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడకుండా పేపర్‌భోయ్‌గా కూడా పనిచేశారన్నారు. సొంతంగా ఎదగాలన్న తపనతో కృషి చేసి ప్రస్తుతం అమర్‌రాజా బ్యాటరీల బ్రాండ్‌ను నాణ్యమైన బ్రాండ్‌గా గుర్తింపు తీసుకువచ్చారని ఆయనను ప్రశంసించారు.