ASBL Koncept Ambience

మౌంటెన్‌హౌస్‌ ట్రేసీ తెలుగు సంఘం దీపావళి వేడుకలు

మౌంటెన్‌హౌస్‌ ట్రేసీ తెలుగు సంఘం దీపావళి వేడుకలు

ఉత్తర కాలిఫోర్నియాలోని మౌంటెన్‌హౌస్‌ ట్రేసీ తెలుగు సంఘం (ఎంటిటిఎ) ఆధ్వర్యంలో దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. మౌంటెన్‌ హౌస్‌లోని బెథానీ స్కూల్‌ మల్టీపర్పస్‌ రూమ్‌లో వేడుకలు జరిగాయి. గాయని శోభారాజు శిష్యురాలు శ్రీమతి వల్లి మోచర్ల గణనాథుని పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీపావళి సంబరాలకు 13వ డిస్ట్రిక్ట్‌ అసెంబ్లీ మెంబర్‌ సుషాన్‌ ఇగ్మాన్‌, బాబ్‌ ఇలియట్‌, రాబర్ట్‌ రిక్‌మెన్‌, బ్రియన్‌ లూసిడ్‌, బెర్‌నైస్‌ ట్రయాంగిల్‌ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మౌంటెన్‌హౌస్‌లోని తెలుగువారంతా సంప్రదాయ దుస్తులను ధరించి ఈ కార్యక్రమానికి వచ్చారు. దీపావళి సంబరాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ప్రామీత్‌షా, త్రిప్తిగతాది వ్యాఖ్యాతలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఎంటిటిఎ కార్యనిర్వాహక సంఘం ముఖ్య అతిథులుగా వచ్చిన వారిని భారత్‌ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గొడవర్తి పనసరమన్న, ఆల్టర్నేట్‌ థెరపి డాక్టర్‌ సునీత పటేల్‌, ప్రవీణ్‌ పటేల్‌ను ఘనంగా సత్కరించారు. చివరగా కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ఎంటిటిఎ అధ్యక్షుడు రాము మందాల, ఉపాధ్యక్షుడు రవికిరణ్‌ కేథిడి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

 

Tags :