ASBL Koncept Ambience

బహుళ అంతస్థులతో హైదరాబాద్ జిగేలు

బహుళ అంతస్థులతో హైదరాబాద్ జిగేలు

హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకు భూముల ధరలు పెరిగిపోతుండటంతో అనేక కంపెనీలు బహుళ అంతుస్థుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. దీనివల్ల కస్టమర్లకు అందుబాటు ధరను నిర్ణయించి ఆకట్టుకోవచ్చని ఆ సంస్థలు చెబుతున్నాయి. చాలా సంస్థలు నివాస సముదాయలే కాకుండా వాణిజ్య భవనాలు ఇందులో ఉండటం విశేషం. ప్రధానంగా, కూకట్‌పల్లి, మాదాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కోకాపేట్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, తెల్లాపూర్‌, నలగండ్ల వంటి ప్రాంతాల్లో అధిక శాతం మంది డెవలపర్లు వీటిని నిర్మిస్తున్నారు.

చాలామంది సొంత ఇంటికన్నా అపార్టుమెంట్‌లపై ఎక్కువ మోజు చూపుతున్నారు. పైగా, ఎంత ఎత్తుకెళితే అంత ప్రశాంతమైన గాలి, వెలుతురు లభిస్తుందనే ఏకైక కారణంతో బహుళ అంతస్థుల నిర్మాణాలపై మోజు చూపుతున్నారు. ఆకాశహర్మ్యాల వైపు దష్టి సారించేవారి సంఖ్య పెరుగుతుండటంతో, అపార్టుమెంట్‌ను మొత్తం ఆధునికంగా తీర్చిదిద్దడం మీదే డెవలపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణ నిర్మాణాలతో పోల్చితే ఆకాశహర్య్మాలను కట్టడానికి నిర్మాణ వ్యయం ఎక్కువే అవుతున్నప్పటికీ, కొనుగోలుదారులకు నాణ్యమైన ఫ్లాట్లను అందించడానికి డెవలపర్లు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్న సంస్థల వివరాలు...

నివాస సముదాయాలు

జయభేరి పీక్‌ - 29 అంతస్తులు
సైబర్‌ సిటీ మెరీనా స్కైస్‌ - 31 అంతస్తులు
మై హోమ్‌ అవతార్‌ - 31 అంతస్తులు
ప్రెస్టీజ్‌ హై ఫీల్డ్స్‌ - 35 అంతస్తులు
లోదా బెల్లెజా - 39 అంతస్తులు
ఇన్‌కార్‌ వన్‌ సిటీ - అంతస్తులు- 33 

ఆఫీసు భవనాలు

మైహోమ్‌ ఆర్‌ఎంజెడ్‌ స్కై వ్యూ 10 - 21 అంతస్తులు
మైహోమ్‌ ఆర్‌ఎంజెడ్‌ - స్కై వ్యూ 20 టవర్‌ -21 అంతస్తులు
మీనాక్షి డెలాయిట్‌ 1 - 16 అంతస్తులు
మీనాక్షి టెక్‌పార్క్‌ - 11 అంతస్తులు
మీనాక్షి డెలాయిట్‌ 2 - 14 అంతస్తులు
ఎస్‌ఏఎస్‌ ఐ టవర్‌ - 33 అంతస్తులు
అరబిందో గెలాక్సీ - 27 అంతస్తులు
లక్ష్మీ ఇన్‌ఫోబాన్‌ టవర్‌ 8 - 24 అంతస్తులు

 

Tags :