నాటా మహాసభలకు సంగీత దర్శకులు
మూడు రోజులు సంగీత విభావరులతో అలరించే కార్యక్రమాలు
దేవిశ్రీ ప్రసాద్, ఎస్.ఎస్.థమన్, అనూప్ రూబెన్స్ రాక
డల్లాస్‌లో జూన్ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు డల్లాస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే నాటా మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. టాలీవుడ్ సినీ కళాకారులతోపాటు సంగీత దర్శకులను కూడా ఆహ్వానించారు.
టాలీవుడ్‌లో ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరిని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సౌత్ ఇండియా మ్యూజికల్ డైరెక్టర్‌గా పేరు పొండటంతోపాటు ఎన్నో అవార్డులను అందుకున్న దేవిశ్రీ ప్రసాద్ నాటా మహాసభల్లో తనదైన స్టయిల్‌లో వచ్చినవారిని అలరించనున్నారు.
తెలుగు సినిమా, తమిళ సినిమాలలో ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఎస్.ఎస్. థమన్ కొన్ని చిత్రాల్లో పాటలను పాడారు. ప్రస్తుతం చాలా చిత్రాల్లో బిజీగా ఉన్న తమన్ నాటా మహాసభల్లో తన సంగీత విభావరితో ప్రేక్షకులను అలరించనున్నారు.
అనూప్ రూబెన్స్ టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. యూత్‌ను ఆకట్టుకునే చిత్రాలు కూడా అందులో ఉన్నాయి. నాటా మహాసభల్లో తనదైన స్టయిల్‌లో సంగీత విభావరిని నిర్వహించేందుకు ఆయన డల్లాస్ వస్తున్నారు.
ఈ ముగ్గురి సంగీత విభావరులతో నాటా మహాసభలు ఆకర్షణీయంగా ఉంటాయని నిర్వాహకులు అంటున్నారు. దీంతోపాటు మరిన్ని సినీ సంగీత కార్యక్రమాలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు.