ASBL Koncept Ambience

మైహోమ్ తర్కష్య ప్రారంభం

మైహోమ్ తర్కష్య ప్రారంభం

హైదరాబాద్‍లోని కోకాపేటలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును మైహోమ్‍ కన్‍స్ట్రక్షన్స్ ప్రారంభించింది. ‘మైహోమ్‍ తర్కష్య’ పేరుతో ఉన్న ఈ ప్రాజెక్టులో అత్యాధునికమైన సదుపాయాలను కల్పిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. 5.82 ఎకరాల్లో అభివ•ద్ధి చేస్తున్న ‘మైహోమ్‍ తర్కష్య’లో నాలుగు బ్లాక్‍లు ఉంటాయని.. ఒక్కో బ్లాక్‍లో జీ ప్లస్‍ 32 అంతస్తులు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఒక్కొక్కటి 1,957, 2,235 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 660 ట్రిపుల్‍ బెడ్‍ రూమ్‍ గ•హాలను ఇందులో నిర్మిస్తున్నారు. అత్యాధునిక జిమ్‍, సూపర్‍ మార్కెట్‍, ఏసీ అతిథి గదులు, క్రెష్‍, టెన్నిస్‍, బ్యాడ్మింటన్‍ కోర్టులు, స్పా వంటి అన్ని రకాల సదుపాయాలు ఇందులో కల్పిస్తున్నట్లు మైహోమ్‍ కన్‍స్ట్రక్షన్స్ సంస్థ తెలిపింది. ప్రాజెక్టు ప్రారంభం రోజునే 50 శాతం పైగా యూనిట్లు అమ్ముడయ్యాయని పేర్కొంది. తర్కష్య ప్రాజెక్టుకు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‍ స్వామి శంకుస్థాపన చేశారు.

 

Tags :