దేవకన్య అవతారంలో ఇస్మార్ట్ బ్యూటీ
నన్ను దోచుకుందువటే(Nannu Dochukunduvate) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా నటేష్(Nabha Natesh) మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) తో మంచి హిట్ అందుకున్న నభా మధ్యలో యాక్సిడెంట్ అవడంతో సినిమాల నుంచి రెస్ట్ తీసుకుని మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. నభా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా అమ్మడు దేవ కన్య రూపంలో అవతారమిచ్చింది. ఈ ఫోటోల్లో నభా కేరళ సాంప్రదాయ దుస్తుల్లో నడుము అందాలు చూపిస్తూ ముక్కెర పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి ఎంతో అందంగా కనిపిస్తోంది. నభా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :