ASBL Koncept Ambience

టీఆర్ఎస్ లో చేరిన నామా

టీఆర్ఎస్ లో చేరిన నామా

ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ నివాసంలో ఆయన సమక్షంలో తన అనుచరులతో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని నామా తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన తాగు, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు తనను ఆకర్షించాయన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే కేసీఆర్‌ నాయకత్వంలోనే రాష్ట్రం ఉండాలన్నారు. ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. అధినేత ఆదేశానుసారం నడుచుకుంటానని నాగేశ్వరరావు వెల్లడించారు.

 

Tags :