ASBL Koncept Ambience

ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా ?

ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా ?

ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పేరును టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నామా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అన్ని అంశాలపై చర్చించి నామా పేరును ఖమ్మం అభ్యర్థిగా కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలకు తెలిపినట్లు సమాచారం.

 

Tags :