హౌడీ మోడీకి ధీటుగా... నమస్తే ట్రంప్
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా నమస్తే ట్రంప్ కార్యక్రమం జరుగుతుంది. ఇది వేడుకగా సాగుతుంది. అమెరికా పర్యటనలో హ్యుస్టన్ తనకు ఏర్పాటు అయిన హౌడీ మోడీకి ధీటుగా, వీలయితే అంతకు మించిన స్థాయిలో దీనిని నిర్వహించాలని మోదీ తలపెట్టారు. జన సాంద్రత అత్యధికంగా ఉండే భారత్‍లో తన పర్యటన కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ట్రంప్ ఇటీవలె తెలిపారు. తన సభలకు అమెరికాలో పరిస్థితి నేపథ్యంలో వేల సంఖ్యలోనే జనం వస్తారని, అదే భారత్‍లో తన సభ లక్ష మందితో ఏర్పాటు అవుతుందని తెలిసి ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‍లో జరిగే సభకు నమస్తే ట్రంప్ పేరు పెట్టినట్లు భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్థన్ శ్రింగ్లా తెలిపారు.
Tags :