అందరి దృష్టి నంద్యాలపైనే
నంద్యాల ఉప ఎన్నిక ఫలితం కోసం 23న జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల్లోనే ఆధిక్యత తేలిపోతుంది. విజయంపై అటు వైకాపా, ఇటు తెదేపా ధీమాగా ఉన్నాయి. నంద్యాల సెగ్మెంట్ గత 65 ఏళ్ల చరిత్రలో నమోదుకానంత భారీ పోలింగ్ సాగడం తమకే లాభిస్తుందని రెండు పార్టీలూ బల్ల గుద్దిమరీ చెబుతున్నాయ. 79.2 శాతం పోలింగ్ ఇరుపార్టీల అంచనాలు తారుమారు చేస్తూ, అయోమయాన్ని సృష్టించింది. అభివృద్ధి నినాదం తమకే ఓట్లు కురిపిస్తుందని తెదేపా భావిస్తుంటే, ప్రభుత్వం, బాబు పనితీరుపై వ్యతిరేకత తమను గెలిపిస్తుందని వైకాపా ధీమాగా ఉంది. ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ మరుసటి రోజు నంద్యాలలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు మరింత గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Tags :