కార్మికుల సమస్యలకు పరిష్కారం : లోకేశ్
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ప్రాచారం ప్రారంభించారు. పట్టణంలోని 10వ వార్డులో అందర్నీ అప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అడిగారు. నేత కార్మికుడు వెంకటేశ్వరరావు తన ఇంటిలో అచ్చువేస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న ఆయన దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. వస్త్రాల తయారీలో అచ్చు కీలక పాత్ర పోషిస్తుందని కార్మికుడు వెంకటేశ్వరావుకు, అతని భార్య మంత్రికి వివరించారు. చేనత కార్మికుల కష్టాలు, వారికి ఉన్న ఇబ్బందులను లోకేశ్‌కు తెలియజేశారు. 50 సంవత్సరాలు నుంచి ఇదే పని చేస్తున్నా, తమ జీవితాల్లో ఎలాంటి మార్పులూ రాలేదని తెలిపారు. త్వరలోనే నేత కార్మికుల కష్టాలు తీరేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.
Tags :