పీఎంని నిర్ణయిస్తాం.. హోదా తెస్తాం
రాబోయే ఎన్నికల్లో ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబే నిర్ణయిస్తారు. తద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తారు. కేంద్రంలో చక్రం తిప్పి ప్రధాన మంత్రిని నిర్ణయించాలంటే రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలి అని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరధిలోని దుగ్గిరాల మండలంలో లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలోని మోదీ, ప్రతిపక్ష నేత జగన్, కేసీఆర్ కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. హోదా ఇవ్వాల్సిన మోదీ ఈడీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ హోదాపై పార్లమెంటు సాక్షిగా గళం వినిపించారు. ఇది జీర్ణించుకోలేని మోదీ ఎంపీకీ ఈడీ నోటీసులు పంపించారు అని విమర్శించారు.
Tags :