చంద్రబాబుతో పోటీ పడలేక జగన్ తో లాలూచీ
అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ దూసుకుపోతుండటంతో ఓర్వలేక తెలంగాణ సీఎం కేసీఆర్ అసూయతో కుట్రలు పన్నుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల రేవేంద్రపాడు, శృంగారపురం, పేరుకులపూడి, చుక్కపల్లివారిపాలెం, నల్లమేకలవారిపాలెం, తాడిబోయినవారిపాలెం, ఈమని, చింతలపూడి గ్రామాల్లో ఆయన రోడ్‌షోలు నిర్వహిస్తూ, ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు కూడళ్ల వద్ల ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. వైసీపీ అధినేత జగన్ తనపై ఉన్న కేసులు భయంతో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల ముందుతాకట్టు పెట్టారన్నారు. అభివృద్ది, సంక్షేమంలో చంద్రబాబుతో పోటీ పడలేక జగన్‌తో లాలూచీ పడిన మోదీ, కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. జగన్‌కు ప్రచార రథాలు, రూ.వెయ్యి కోట్ల నగదు పంపించిన కేసీఆర్‌కు దమ్ముంటే ఆంధ్రాకు నేరుగా వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సవాల్ విసిరారు.