ASBL Koncept Ambience

అక్కడ గెలిచి 30 ఏళ్ల చరిత్రను తిరగరాస్తా

అక్కడ గెలిచి 30 ఏళ్ల చరిత్రను తిరగరాస్తా

1985 తరువాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరలేదు. ఈసారి అక్కడ గెలిచి 30 ఏళ్ల చరిత్రను మార్చబోతున్నా అని మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌ అన్నారు. రాజధాని పరిధి తాడేపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ మంగళగిరిలో ఒక తాతయ్యను పింఛను వస్తోందా? అని వాకబు చేశా. పింఛను అందుతోందనీ, దానితోపాటు ఆత్మగౌరవం కూడా నిలబడిందని చెప్పారు. అదెలా అని అడిగితే ఆయనకున్న ముగ్గురు కోడళ్లు రూ.200 పింఛను వచ్చేటప్పుడు పట్టించుకునేవారు కాదట. రూ.వెయ్యి పింఛను చేసినపుడు అప్పుడప్పుడు భోజనం పెట్టేవారట. ఇప్పుడు రూ.2 వేలు పింఛను చేశాక వారిలోవారే అన్నం నేనంటే నేను పెడతానంటూ గొడవలు పడుతున్నారట. నా పెద్ద కుమారుడు చంద్రబాబు వల్లే నాకు ఆత్మగౌరవం దక్కిందని అని ఆ తాయ్య చెప్పారు. అలాగే ఓ చెల్లెమ్మను పసుపు కుంకుమ వచ్చిందా? అని అడిగా ఆమె ఇంట్లోకి పరుగులు తీసి వెంటనే బయటకు వచ్చి కొత్త చీర చూపింది. పెళ్లైన తర్వాత మొదటిసారి మంచి చీరను కొన్నా. అందుకు చంద్రన్న ఇచ్చిన పసుపు కుంకు  నగదే కారణమని చెప్పింది. వచ్చే ఐదేళ్లలో మరో మూడుసార్లు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద నగదు ఇచ్చే బాధ్యత చంద్రన్న తీసుకుంటారు. ప్రజల కోసం కొత్త పథకాలను ప్రవేశపెడతారు అని పేర్కొన్నారు.

 

Tags :