మంగళగిరిలో మంత్రి లోకేష్ ప్రచారం
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని రత్నాల చెరువు, లక్ష్మీనరసింహ కాలనీ ప్రాంతాల్లో లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలపై ఆయన హామీల వర్షం కురిపించారు. మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ బ్రాండింగ్ తీసుకొస్తామని, రూ.250 కోట్లతో చేనేత మార్కెటింగ్ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే చేనేత కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామన్నారు. దీనితో పాటు చేనేత కార్మికులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. అంతేకాదు మంగళగిరిలో అంతర్జాతీయ టెక్స్‌టైల్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులకు రూ.2 లక్షల చొప్పున రుణాలు అందజేస్తామని ప్రకటించారు.
Tags :