2019 ఎన్నికలు చాలా కీలకం : లోకేశ్
అంకుర సంస్థల స్థాపనపై యువత దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని చెప్పారు. 2019 ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకం కానున్నాయని అన్నారు. విశాఖపట్నంలో విద్యార్థులతో మంత్రి లోకేశ్, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌తో కలిసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నత విద్యా రంగంలో ఉన్న సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పులు వంటి కీలక అంశాలపై విద్యార్థులలో చర్చించారు. ప్రతి సమస్యకు ప్రభత్వ పరంగా తీసుకున్న, తీసుకోనున్న చర్యలను వివరించారు. పలు కళాశాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఈ చర్చలో పాల్గొన్నారు. నాణ్యమైన ఉన్నత విద్య, గౌరవ ప్రదమైన ఉద్యోగావకాశాలు అందరికీ అందజేయడానికి తన వంతు కృషిచేస్తానని ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ యువతకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో యువతకు పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు వచ్చాయని లోకేశ్ అన్నారు. దేశంలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష అని చెప్పారు.