క్యాడెన్ కంపెనీ ప్రెసిడెంట్ అనిరుద్, సీఈఓ లిప్ భ్యూటాన్ తో భేటీ
సెమీ కండెక్టర్స్ త్రీడీ ఐసి డిజైన్, అడ్వాన్స్డు నోడ్, ఆటోమోటివ్, ఫోటానిక్స్, ఆర్మ్ బేస్డ్ సొల్యూషన్స్, చిప్ డిజైన్ తయారీలో ఉన్న క్యాడెన్ కంపెనీ ప్రెసిడెంట్ అనిరుధ్, సీఈఓ లిప్ భ్యూటాన్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందఠంగా మంత్రి మాట్లాడుతూ టెక్నాలజీ సహాయంతో గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏరియల్ ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసి వివిధ సేవలు అందిస్తున్నామన్నారు. మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్‌ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నామని, ఫ్యాక్స్ కాన్, సెల్ కాన్, డిక్సన్, కార్బన్ లాంటి మోబైల్ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన కియా మోటార్స్‌తోపాటు ఇసుజూ, అపోలో టైర్స్ రాష్ట్రానికి వచ్చాయన్నారు. ప్రస్తుతం తయారీ రంగంలో 15శాతం వ ద్ధి సాధించామని, 32శాతం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా మన్నారు.
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో యువతి, యువకులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అందుకు మీ సహకారం కావాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్నామని, ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల ఏర్పాటుకు మౌలికవసతులు కల్పిస్తున్నామని, అనేక పాలసీలతోపాటు రాయి తీలు కల్పిస్తున్నట్లు వివరించారు. క్లౌడ్ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చామని, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సీఈఓ లిప్ భ్యూటాన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ అంతా డేటాపై ఆధారపడి ఉంటుందని, చిప్ డిజైన్ యూనివర్శిటీ, ఇంక్యూబేటర్ ఏర్పాటుకు సహకారం అందిస్తామన్నారు. ఏపీలో కార్యకలాపాలు విస్తరించే అంశంపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.