ASBL Koncept Ambience

రాష్ట్రంలో శాంసంగ్ ఈ-కామర్స్ కేంద్రం

రాష్ట్రంలో శాంసంగ్ ఈ-కామర్స్ కేంద్రం

రాష్ట్రానికి శాంసంగ్‌ సంస్థ రానుంది. గ్లోబల్‌ ఈ-కామర్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని నారా లోకేష్‌ తెలిపారు. పర్యటనలో భాగంగా ఆ సంస్థ చీఫ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌ కాల్‌రామన్‌తో లోకేష్‌ భేటీ అయినప్పుడు తమ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఈ-కామర్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  సియాటెల్‌లో పర్యటన సందర్భంగా లోకేష్‌ కాల్‌రామన్‌తో భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఈ దిశగా సాధించిన పురోగతిని లోకేశ్‌ వివరించారు. దీనికి కాల్‌రామన్‌ స్పందిస్తూ... 'నేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పెద్ద అభిమానిని. చంద్రబాబు ఆలోచనల్ని, ఆయన విజన్‌ని బలంగా నమ్ముతాను. నేను అమెజాన్‌లో పనిచేస్తున్నప్పుడు హైదరాబాద్‌లో ఆ కంపెనీ ఏర్పాటుకు మూడురోజుల్లోనే అనుమతులిచ్చారు. ఇప్పుడక్కడ 30వేల ఉద్యోగాలు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌కు అన్నిరకాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. మీరు మాటిస్తే దానికి కట్టుబడి ఉంటారనే నమ్మకం ఉంది. శాంసంగ్‌ వివిధ రంగాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. శాంసంగ్‌ గ్లోబల్‌ ఈ-కామర్స్‌ సెంటర్‌ను మీ రాష్ట్రంలో ఏర్పాటుచేస్తాం. స్వచ్ఛందంగా నేను పేదల చదువుకు సాయం చేస్తున్నాను. ఏపీలో ఒక స్కూల్‌ నిర్మిస్తాను. వెయ్యిమంది పేద విద్యార్థుల్ని దత్తత తీసుకుంటాను' అని ప్రకటించారు.

Tags :