ASBL Koncept Ambience

హారీస్‌బర్గ్‌లో నరేన్ కొడాలి ప్రచారం

హారీస్‌బర్గ్‌లో నరేన్ కొడాలి ప్రచారం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డాక్టర్‌ నరేన్‌ కొడాలి తన టీమ్‌ సభ్యులతో కలిసి హారీస్‌బర్గ్‌లో పర్యటించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హారిస్‌బర్గ్‌ తానా ఆత్మీయులతో, సభ్యులతో నరేన్‌ కొడాలి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వసుదైవ కుటుంబం, మనమంతా ఒక్కటే అనే నినాదంతో  ఈ ఎన్నికల్లో ముందడుగు వేస్తున్నామని, తన అభ్యర్థిత్వంతో పాటు తమ ప్యానెల్‌ సభ్యులను కూడా తానా ఓటర్లు గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రవి పొట్లూరి , మందలపు రవి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :