ASBL Koncept Ambience

నరేన్ కొడాలి ధీటు ప్రచారం...టీమ్ తానాలో ఆశలు

నరేన్ కొడాలి ధీటు ప్రచారం...టీమ్ తానాలో ఆశలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికలు తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో తానా ప్రెసిడెంట్‍ పదవికి పోటీ పడుతున్న నరేన్‍ కొడాలి తన ప్రచారాన్ని మరింతగా పెంచారు. తనపై ఎదుటివర్గం చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్‍ విసిరారు. అట్లాంటాలో జరిగిన ప్రచార కార్యక్రమంలో నరేన్‍ కొడాలి మాట్లాడుతూ, డీసీలో జరిగిన మహాసభల్లో గానీ, తాను బోర్డ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడుగానీ తానాకు దాతలు అందించిన నిధుల్లో దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు చూపిస్తే తను ఎన్నికల్లో గెలిచినా ప్రమాణస్వీకారం చేయనని ప్రత్యర్థులకు సవాల్‍ విసిరారు. సంస్థ ఔన్నత్యాన్ని కాపాడేందుకు తాను 18ఏళ్లు కష్టపడ్డానని, అలాంటి సంస్థకు దాతలు అందించిన  విరాళాలను దుర్వినియోగం చేసే అలవాటు తనకు గాని, తన టీమ్‍కు గాని లేదని స్పష్టం చేశారు. ఆరోపణలు చేసినవారు నిరూపించాలని ఆయన సవాల్‍ విసిరారు.  అట్లాంటా పరిసర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రవాసులు కూడా భారీ సంఖ్యలో హాజరయి నరేన్‍ కొడాలి ప్యానెల్‍కు తమ సంఘీభావాన్ని తెలిపారు.

హ్యూస్టన్‍లో...

హ్యూస్టన్‍లో జరిగిన ప్రచార కార్యక్రమంలో కూడా నరేన్‍ కొడాలి ఆకట్టుకునేలా ప్రసంగించారు. తానాలాంటి సంస్థ ఇబ్బందుల్లో పడినప్పుడు దానిని ఆదుకున్న వ్యక్తులు ఉన్న మా టీమ్‍ను గెలిపిస్తే తానాను మరింతగా విస్తరించి సేవలందించేలా చూస్తామని అధ్యక్ష అభ్యర్థి నరేన్‍ కొడాలి అన్నారు. హ్యూస్టన్‍ ప్రవాసులతో స్థానిక గోదావరిలో సమావేశమైన ఆయన తన ప్యానెల్‍ను పరిచయం చేసి ప్రసంగించారు. సంస్థ దినదినప్రవర్ధమానంగా వెలుగొందాలని ఆకాంక్షించే వారిలో తాను, తన ప్యానెల్‍ పప్రథములమని అందుకే తమను బలపరచాలని ఆయన కోరారు.   ప్రచార కార్యక్రమంలో కొడాలి టీమ్‍ సభ్యులు విజయ్‍ గుడిసేవ, రవి పొట్లూరి, భక్తబల్లా, వెంకట్‍కోగంటి, జగదీశ్‍ ప్రభల, రజనీకాంత్‍కాకర్ల, చాందిని దువ్వూరి, రాజా సూరపనేని, మన్నే సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం తదితరులు పాల్గొన్నారు.

 

Tags :